![]() |
![]() |

ఈటీవీలో రీసెంట్ గా "ఆలీతో ఆల్ ఇన్ వన్" అనే గేమ్ షో ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ షో కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక హోస్ట్ ఆలీ చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఇక ఈ వారం ఎపిసోడ్ కి ఆరియానా, మెహబూబ్, అలీ రెజా వచ్చారు. ఇందులో హోస్ట్ ఆలీని బావా, బావా అంటూ రకరకాలుగా టీజ్ చేసింది ఆరియానా. వీళ్ళ ముగ్గురితో రకరకాల గేమ్స్ ఆడించారు ఆలీ. ఫస్ట్ రౌండ్ "నేడే చూడండి" లో మెహబూబ్ వచ్చి గేమ్ ఆడి టవర్ ఫ్యాన్ ని గెలుచుకున్నాడు. ఇక నెక్స్ట్ రౌండ్ "నేనైతే"లో స్క్రీన్ మీద ఇచ్చిన పిక్చర్స్ ని అల్లి ఒక కథ చెప్పాలన్నమాట...ఇందులో ముగ్గురూ రకరకాల కథలు చెప్పారు.
ఆరియానా కథ అల్లేసి వెళ్ళిపోయాక అలీ రెజా ఒక షార్ట్ ఫిలిం స్టోరీ చెప్పాడు..దానికి ఆరియానా కౌంటర్ ఇచ్చింది. "ఒక క్రిటిక్ గా చెప్పాల్సి వస్తే నేను ఈ సినిమాని అఫెండ్ చేస్తున్నా..అసలు ఏమిటా స్క్రీన్ ప్లే..డైరెక్టర్ కి ఒక క్లారిటీ లేదు..పాడు లేదు..సినిమాలు తియ్యడానికి వచ్చేస్తున్నారు. ఒక ముద్దు లేదు, ఒక రొమాన్స్ లేదు..సినిమా అంటే ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తాం కదా. ఒక ఫైట్ లేదు, ఒక ముద్దు లేదు...ఏం సర్ ఆ పెదాలు అక్కడ పెట్టాడు కానీ అవి పోస్టర్ల వరకే" అని ఆరియానా అనేసరికి "ఇనీషియల్ గా పెడదాం అనుకున్నా కానీ హీరోయిన్ నువ్వు అని తెలిసాక అది కట్ చేసాను..డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది.
కానీ నిన్ను అలా చూడలేకపోతున్నా " అన్నాడు అలీ రెజా. ఐతే ఈ సెకండ్ రౌండ్ లో ఆరియానా విన్నర్ అని అనౌన్సర్ చేశారు ఆలీ..."సర్ మేము ఎందుకు ఓడిపోయామో తెలుసా..మా సినిమాలో మిమ్మల్ని తీసుకోలేదు కాబట్టి" అని చెప్పాడు అలీ రెజా ఫన్నీగా. ఆ తర్వాత ఆమెకు కూడా గిఫ్ట్ ని అందించారు ఆలీ. "నువ్వు ఎక్సరసైజ్ చేస్తావా బాగా" అని ఆరియానని అడిగేసరికి "ఎస్ సర్ నేను ఎక్సరసైజ్ స్టార్ట్ చేస్తాను. జిమ్ వీడియోతో నేను ఫేమస్ కానీ నేనెప్పుడూ జిమ్ కి వెళ్ళను..కానీ మీరు ఇస్తున్న ఈ ఎయిర్ బైక్ చూసేసరికి నేను కూడా జిమ్ కి వెళదామని ఫిక్స్ అయ్యాను " అని చెప్పింది. "పెద్దాయన ఒకాయన ఉన్నాడు కదా..మన గురువు..ఆయనకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు ఆలీ. "పెద్దాయన అనేసరికి కాదు బాలుడు అంది ఆరియానా.. ఆర్జీవీ గారు ఏంటి ఎక్కడి కెళ్ళినా వదలట్లేదు మీరు నన్ను" అని కామెడీ చేసింది ఆరియానా.
![]() |
![]() |